Officer On Duty : నెట్ ఫ్లిక్స్ లో ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ సినిమా

officer on duty
  •  ప్రత్యేక ఆకర్షణగా విలన్ గ్యాంగ్

సాధారణంగా ఓ సినిమా చూసిన తర్వాత హీరోయిజం వహించిన పవర్‌ఫుల్ సీన్స్, హీరోయిన్ గ్లామర్ షాట్స్, లేదా నవ్వుల వర్షం కురిపించిన కామెడీ సన్నివేశాలు మనను వెంటాడుతూ ఇంటివరకూ వస్తాయి. ఒకప్పటి విలనిజం, ఆ విలన్స్ చేసే మేనరిజం కూడా జనాల్లో బాగా పాపులర్ అయ్యేది. కానీ, ఇటీవలి కాలంలో స్టైలిష్‌గా కనిపిస్తూ భయపెట్టే విలనిజం మాత్రం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనిపించలేదని చెప్పాలి.

అయితే, ఆఫీసర్ ఆన్ డ్యూటీ చూసినవాళ్లంతా ఈ సినిమాలోని విలన్ గ్యాంగ్ గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. కథ ప్రకారం, ఒక యువకుడు పోలీస్ విచారణలో చనిపోతాడు. అయితే, అతను ఒక డ్రగ్స్ మాఫియా బ్యాచ్‌కు చెందినవాడు. దాంతో, ఆ బ్యాచ్ ఆ పోలీస్ ఆఫీసర్‌పై పగ పెంచుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ వాళ్లను వేటాడుతుంటే, వాళ్లు అతడిని ఛేదించేందుకు ప్రయత్నిస్తారు. సరైన అవకాశం దొరికితే తీరు చూపించాలని చూస్తారు.

ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. మాదకద్రవ్యాలు, అక్రమ సంబంధాలు, విచ్చలవిడితనానికి అలవాటు పడిన ఈ గ్యాంగ్ చేసే హడావిడి మామూలుగా ఉండదు. వాళ్లు నటిస్తున్నారా? జీవిస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది. అంతగా పాత్రలలో తమను ఒదిగించుకున్నారు.

విలన్ గ్యాంగ్‌లో ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. వాళ్ల యాక్టింగ్‌ చూసేందుకు మాత్రమేనైనా ఈ సినిమాను తప్పకుండా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఇటీవలి కాలంలో ప్రేక్షకులు మరిచిపోలేని విలన్ గ్యాంగ్ ఇదేనని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఈ సినిమా ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read : Amy Jackson: మరో బిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్

Related posts

Leave a Comment