-
తండ్రి మోహన్ బాబు బర్త్‌డేపై ఎమోషనల్ అయిన మంచు మనోజ్
నటుడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా, ఆయన కుమారుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత సందేశం పోస్ట్ చేశారు. తండ్రికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మనమంతా కలిసి వేడుకలు జరుపుకునే ఈ రోజున, మీ పక్కన ఉండే అవకాశం కోల్పోయాను. మీతో గడిపే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా. లవ్ యూ” అంటూ మనోజ్ భావోద్వేగపూరితంగా రాశారు. దీనికి తోడు, ఒక ఫొటోతో పాటు వీడియోను కూడా జోడించారు.
ఇటీవల మంచు కుటుంబంలో వివాదాల కారణంగా మనోజ్, మోహన్ బాబు మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన పెట్టిన ఈ పోస్ట్ ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.
Read : Telangana: తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఎదురుదెబ్బ