L2 Empuraan : ‘ఎల్‌-2 ఎంపురన్‌’ మూవీ రివ్యూ

empuraan
  • L2 Empuraan : ‘ఎల్‌-2 ఎంపురన్‌’ మూవీ రివ్యూ

మలయాళ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘లూసిఫర్’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్‘. ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో, ప్రేక్షకుల్లో సినిమా పై ఆసక్తి పెరిగింది. అసలు ఈ కథ ఏమిటి? ఈ సినిమాలోని రాజకీయ నేపథ్యం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? వివరంగా తెలుసుకుందాం.

కథ:

‘లూసిఫర్’ ముగిసిన చోటినుంచి ‘ఎల్2: ఎంపురాన్’ ప్రారంభమవుతుంది. పీకే రామదాస్ (సచిన్ ఖేడ్కర్) మరణంతో, అతని పార్టీలో అంతర్గత కలహాలు చెలరేగుతాయి. స్టీఫెన్ వట్టిపల్లి (మోహన్‌లాల్) జతిన్ రామదాస్ (టోవినో థామస్)ను సీఎంగా నిలబెట్టిన తర్వాత అదృశ్యమవుతాడు. అయితే, అధికారంలోకి వచ్చిన జతిన్ అక్రమాలకు పాల్పడుతుండటంతో, పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి పరిపాలన సాగిస్తాడు.

జతిన్ నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చి ‘ఐయూఎఫ్ పీకే’ అనే కొత్త పార్టీని స్థాపించి, బాబా భజరంగీ (అభిమన్యు)తో కలిసి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతాడు. అయితే, జతిన్ నిర్ణయాన్ని అతని సోదరి ప్రియదర్శి (మంజు వారియర్) వ్యతిరేకిస్తుంది. ఇదే సమయంలో, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కుట్రలు, సహజ వనరుల దోపిడిని అరికట్టేందుకు స్టీఫెన్ తిరిగి వచ్చాడా? అతను బాబా భజరంగీ కుట్రను ఎలా ఎదుర్కొన్నాడు? ఈ పోరాటంలో సయ్యద్ మసూద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) పాత్ర ఏమిటి? స్టీఫెన్‌కు అతను ఎలా సహాయపడ్డాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

‘లూసిఫర్’ ముఖ్యంగా రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ నేపథ్యంతో ఆకట్టుకుంది. కానీ, ‘ఎల్2: ఎంపురాన్’లో పొలిటికల్ డ్రామాతో పాటు డ్రగ్స్ మాఫియా అంశాన్ని జోడించారు. అయితే, ఈ సీక్వెల్‌లో కథనం బలహీనంగా అనిపించింది. సాంకేతికంగా అత్యున్నతంగా తెరకెక్కించినా, కథలో ఆసక్తికరమైన మలుపులు లేకపోవడం నిరాశ కలిగించింది. మొదటి భాగం నెమ్మదిగా సాగిపోతే, రెండో భాగం కొంత మెరుగ్గా అనిపిస్తుంది.

సినిమా మొదలైన గంట తర్వాత మోహన్‌లాల్ ఎంట్రీ ఇవ్వడం, అప్పటి వరకు సాగిన కథనం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడం ఈ చిత్రానికి మైనస్. ‘లూసిఫర్’లో కనిపించిన రాజకీయ ఉత్కంఠ ఈ చిత్రంలో కనుమరుగైంది. సినిమా మొత్తంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా లేదు. ఇంటర్వెల్‌కు ముందు కొన్ని యాక్షన్ సన్నివేశాలు, క్లైమాక్స్ సీన్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.

నటీనటుల పనితీరు:

స్టీఫెన్ వట్టిపల్లిగా మోహన్‌లాల్ హుందాగా, స్టైలిష్‌గా కనిపించారు. అతని చూపులతోనే చాలా సన్నివేశాలు బలంగా నిలిచాయి. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ఉత్సాహంగా నటించారు. సయ్యద్ మసూద్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ తన పాత్రకు న్యాయం చేశారు. టోవినో థామస్, మంజు వారియర్, కన్నడ కిషోర్ తమ పాత్రలకు తగిన విధంగా నటించారు. ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం సినిమాకు పాజిటివ్ పాయింట్స్.

తీర్పు:

దర్శకుడు ‘ఎల్2: ఎంపురాన్’ను హై స్టాండర్డ్స్‌తో తెరకెక్కించినా, కథనంలో కసరత్తు చేయకపోవడం కారణంగా సినిమా మాదిరిగా మారింది. స్టైలిష్ మేకింగ్, యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే వారికి మాత్రమే ఈ చిత్రం నచ్చొచ్చు. కానీ, రెగ్యులర్ సినీ ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా రుచించకపోవచ్చు. మూడో భాగం అవసరమా? అనే ప్రశ్నకు సమాధానం ఈ సినిమా ముగింపు చూస్తే తేలిపోతుంది.

Movie Name: L2E: Empuraan
Release Date: 2025-03-27
Cast: Mohanlal, Prithviraj Sukumaran, Tovino Thomas, Manju Warrier, Suraj Venjaramoodu, Abhimanyu Singh
Director: Prithviraj Sukumaran
Music: Deepak Dev
Banner: Aashirvad Cinemas, Sree Gokulam Movies

 

Read : Ramcharan : ‘ఆర్‌సీ 16’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

Related posts

Leave a Comment