Kannappa : ‘క‌న్న‌ప్ప’ సినిమా విడుద‌ల వాయిదా… క్షమాపణ కోరుతూ మంచు విష్ణు పోస్ట్

kannappa
  • ‘క‌న్న‌ప్ప’ సినిమా విడుద‌ల వాయిదా… క్షమాపణ కోరుతూ మంచు విష్ణు పోస్ట్

మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమా విడుదల వాయిదా పడింది. ముందుగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం, అనివార్య కారణాలతో ఆలస్యం కానుంది. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత మంచు విష్ణు సోష‌ల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావడానికి మరింత సమయం అవసరం అవుతుందని, అందువల్ల విడుదలను వాయిదా వేయవలసి  వచ్చిందని వివరించారు.

“‘కన్నప్ప’ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించేందుకు మా టీం ఎంతో కష్టపడుతోంది. మంచి అవుట్‌పుట్ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నాం. వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా కొన్ని వారాలు పట్టే అవకాశం ఉన్నందున సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయం తీసుకోవడం బాధగా ఉంది, కానీ ప్రేక్షకుల ఓపిక, మద్దతుకు కృతజ్ఞతలు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం” అని మంచు విష్ణు ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎపిక్ మూవీకి మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించగా, రెబల్ స్టార్ ప్రభాస్ రుద్రుడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read : Kannappa Movie : కన్నప్ప మేకింగ్ వీడియో పంచుకున్న మంచు విష్ణు

Related posts

Leave a Comment