Kannappa : కన్నప్ప టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన మేక‌ర్స్‌

kannappa teaser
  • కన్నప్ప టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన మేక‌ర్స్‌

మంచు విష్ణు ప్రధాన పాత్రలో, ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి సంబంధించి కొత్త టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. 84 సెకన్ల నిడివితో విడుదలైన ఈ టీజర్‌లో విష్ణు పవర్‌ఫుల్ నటన, శక్తివంతమైన విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, రివేటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ చివర్లో కనిపించిన ప్రభాస్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇప్పటికే విడుదలైన ‘శివ శివ శంకరా’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వివిధ భాషల ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్రబృందం ప్రాచార కార్యక్రమాలను జోరుగా కొనసాగిస్తోంది.

Read : Akshay Kumar : ముందు ‘కన్నప్ప’ సినిమాను తిరస్కరించాను

Related posts

Leave a Comment