-
ఐఫా ఉత్తమ నటి అవార్డు గెల్చుకున్న కృతి సనన్
ఓటీటీ సినిమాల విభాగంలో ఉత్తమ నటిగా కృతి సనన్ ఐఫా అవార్డును గెలుచుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారం ప్రారంభమైన ఐఫా అవార్డుల వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. తొలి రోజున బాలీవుడ్ తారలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఐఫా నిర్వాహకులు డిజిటల్ అవార్డులను ప్రకటించారు. ఓటీటీలో విశేష ఆదరణ పొందిన “అమర్ సింగ్ చంకీలా” సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డును ప్రకటించారు. “దో పత్తి” సినిమాలో తన నటనకు గానూ కృతి సనన్ ఉత్తమ నటి అవార్డును అందుకోగా, “సెక్టార్ 36” చిత్రంలో నటించిన విక్రాంత్ మస్సే ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ఆదివారం సాయంత్రం ఈ అవార్డులను అధికారికంగా ప్రధానం చేయనున్నట్లు ఐఫా నిర్వాహకులు తెలిపారు.
ఇతర అవార్డులు గెలుచుకున్నవారు:
- ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్ అలీ (“అమర్ సింగ్ చంకీలా”)
- ఉత్తమ సహాయ నటుడు: దీపక్ (“సెక్టార్ 36”)
- ఉత్తమ సహాయ నటి: అనుప్రియా గోయెంకా (“బెర్లిన్”)
- ఉత్తమ కథ: కనికా ధిల్లాన్ (“దో పత్తి”)
వెబ్ సిరీస్ విభాగం:
- ఉత్తమ వెబ్ సిరీస్: “పంచాయత్ సీజన్ 3”
- ఉత్తమ నటుడు: జితేంద్ర కుమార్ (“పంచాయత్ సీజన్ 3”)
- ఉత్తమ సహాయ నటుడు: ఫైజల్ మాలిక్ (“పంచాయత్ సీజన్ 3”)
- ఉత్తమ దర్శకుడు: దీపక్ కుమార్ మిశ్రా (“పంచాయత్ సీజన్ 3”)
- ఉత్తమ నటి: శ్రేయా చౌదరి (“బందీశ్ బందిట్స్ సీజన్ 2”)
- ఉత్తమ సహాయ నటి: సంజీదా షేక్ (“హీరామండి: ది డైమండ్ బజార్”)
- ఉత్తమ కథ: “కోటా ఫ్యాక్టరీ సీజన్ 3”
- ఉత్తమ రియాల్టీ సిరీస్: “ఫ్యాబ్యులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్”
- ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: “యో యో హనీ సింగ్: ఫేమస్”