Chaava : ‘ఛావా’ తెలుగు ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది

chaava
  • ‘ఛావా’ తెలుగు ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రష్మిక మండన్నా జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఛావా’. మహారాష్ట్ర వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదలై మొదటిరోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ‘ఛావా’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇప్పుడీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేయనుంది. మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ధైర్యం, కీర్తి మేళవించిన అద్భుత దృశ్యకావ్యంగా రూపొందిన ‘ఛావా’ ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.

Read : Rambha : సెకండ్ ఇన్నింగ్స్ కోసం సిద్ధమవుతున్న నటి రంభ 

Related posts

Leave a Comment