Chiranjeevi : విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి కొత్త చిత్రం

chiranjeevi
  • విలేజ్ బ్యాక్ డ్రాప్ ;ప చిరంజీవి కొత్త చిత్రం

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర నిర్మాణం జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే, చాలా కాలం తర్వాత మళ్లీ పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించనుండడం. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ఈ చిత్రానికి వినోదం ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. హీరోయిన్‌గా అదితి రావు హైదరీ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదనంగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ ఆల్బమ్ అందించిన సంగీత దర్శకులు భీమ్స్, రమణ గోగుల ఈ సినిమాకు సంగీతం అందించనున్నారని సమాచారం.

ఇటీవల చిత్ర బృందం సింహాద్రి అప్పన్న ఆలయాన్ని దర్శించి, స్క్రిప్ట్ పూజలు నిర్వహించారు. గతంలో మాదిరిగా రిచ్ సెట్టింగ్స్, హైటెక్ హంగులతో స్టూడియోలలోనే షూటింగ్ చేసిన చిత్రాలకు భిన్నంగా, ఈసారి పూర్తి స్థాయిలో గ్రామీణ వాతావరణంలో సినిమాను తెరకెక్కించనున్నారు.

చిరంజీవి గతంలో ఊరికి ఇచ్చిన మాట, పల్లెటూరి మోసగాడు, శివుడు శివుడు శివుడు, ఖైదీ, అల్లుడా మజాకా, ఆపద్భాంధవుడు, ఇంద్ర, సింహపురి సింహం వంటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాలు కేవలం వినోదమే కాకుండా, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని అద్భుతంగా ప్రతిబింబించాయి. తాజాగా వస్తున్న ఈ చిత్రం కూడా చిరు అభిమానులకు అలాంటి మరో మాసివ్ ఎంటర్‌టైనర్‌గా నిలవనుందని అంచనా.

Read : Amir Khan : ఆమిర్‌తో రిలేష‌న్ షిప్‌పై గౌరీ స్ప్ర‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Related posts

Leave a Comment