-
ఉగాది రోజున చిరు, అనిల్ రావిపూడి సినిమాకు పూజా కార్యక్రమం
మెగాస్టార్ చిరంజీవి – సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రాబోతోందని తెలిసిందే. ఈ సినిమా గురించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనున్నట్లు సమాచారం. ఈ వార్త మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు-అనిల్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఓరియెంటెడ్ గా ఉండబోతుందని, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుండగా, 2026 సంక్రాంతికి విడుదల కావాల్సిన యోచనలో ఉన్నట్లు సమాచారం. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు, అలాగే భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించనున్నారు.
Read : Anil Ravipudi : చిరుతో తీయబోయే చిత్రానికి కథను సిద్ధం చేస్తున్న అనిల్ రావిపూడి