-
సునీత విలియమ్స్ గొప్ప ధైర్యవంతురాలు, ఆమెకు సాటి మరెవరూ లేరు : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి సునీతా విలియమ్స్‌పై ప్రశంసలు కురిపించారు. రోదసిలో 9 నెలలు గడిపిన అనంతరం, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా నలుగురు వ్యోమగాములు ఈ తెల్లవారుజామున భూమికి చేరుకున్న నేపథ్యంలో, చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో స్పందించారు.
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌కు స్వాగతం పలుకుతూ, ఈ సంఘటనను చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన చిరంజీవి, 8 రోజుల్లో తిరిగి వస్తామన్న వారు 286 రోజుల తర్వాత భూమికి చేరుకున్న విషయాన్ని ప్రస్తావించారు. భూమి చుట్టూ 4,577 సార్లు తిరిగిన ఈ ప్రయాణాన్ని గొప్ప సాహసం అని అభివర్ణించారు. సునీతా విలియమ్స్ ధైర్యసాహసాలకు ఎవ్వరూ సాటి కాదని ప్రశంసించిన ఆయన, ఈ ప్రయాణం ఓ అద్వెంచర్ మూవీని తలపిస్తోందని, నిజమైన బ్లాక్ బస్టర్ అని ఆకట్టుకునే రీతిలో పేర్కొన్నారు.
Read : Mahesh Babu Foundation: మహేశ్ బాబు ఔదార్యం.. ఉచితంగా 4,500 హార్ట్ ఆపరేషన్స్