Amir Khan : ఆమిర్‌తో రిలేష‌న్ షిప్‌పై గౌరీ స్ప్ర‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Gouri amir khan
  • ఆమిర్‌తో రిలేష‌న్ షిప్‌పై గౌరీ స్ప్ర‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

బాలీవుడ్ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్ తన 60వ జన్మదిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమయంలో ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. గౌరీతో తనకు 25 ఏళ్ల నుంచి స్నేహం ఉన్నప్పటికీ, గత ఏడాది నుంచి వారు డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. బెంగళూరుకు చెందిన గౌరీ ప్రస్తుతం ఆమిర్ ప్రొడక్షన్‌ హౌస్‌లో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంపై నెటిజన్లు ఆసక్తి చూపిస్తూ గౌరీ గురించి తెగ వెతికారు.

ఇటీవల ఈ జంట మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా గౌరీ తన సంబంధాన్ని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నాకు దయగల వ్యక్తి, నిజమైన జెంటిల్‌మన్‌, నా పట్ల శ్రద్ధగల భాగస్వామి కావాలని అనుకున్నాను” అని చెప్పిన ఆమె, ఆ లక్షణాలన్నీ ఆమిర్‌లో కనిపించాయని వెల్లడించారు.

ఆమిర్ కూడా తన భావాలను పంచుకుంటూ, “నాకు ప్రశాంతతను ఇచ్చే, మానసికంగా నన్ను సంతోషపెట్టే వ్యక్తిని వెతుకుతున్నాను. గౌరీతో ఉన్నపుడు అలాంటి అనుభూతి కలిగింది” అంటూ చెప్పుకొచ్చారు.  ఇక గౌరీ స్ప్రత్‌కు ఇప్పటికే ఆరేళ్ల కుమార్తె ఉన్నట్టు సమాచారం.

Read : Shivaji : హీరోగా రాని స్టార్ డమ్ .. విలన్ గా వచ్చింది: శివాజీ

Related posts

Leave a Comment