-
బుల్లితెరపై రీఎంట్రీ ఇస్తున్న రోజా
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజా… అందరు అగ్ర హీరోల సరసన నటించారు. ఆ తర్వాత బుల్లితెరపై పలు షోల ద్వారా సందడి చేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా జబర్దస్త్ షోలో కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత ఆమె బుల్లి తెరకు దూరమయ్యారు. మంత్రి అయిన తర్వాత రాజకీయాల్లో మరింత బిజీ అయ్యారు.
గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజా కొన్ని రోజుల పాటు కనిపించలేదు. తాజాగా బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆమె రెడీ అయ్యారు. జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్-4లో హోస్ట్ గా ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోను ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో డ్యాన్స్ తో రోజా అలరించారు. రోజాతో పాటు శ్రీకాంత్, రాశి కూడా ఈ షోలో జడ్జిలుగా వ్యవహరించబోతున్నట్టు సమాచారం. మార్చి 2న సాయంత్రం 6 గంటలకు ఈ షో మొదలుకానుంది.
Read : Director Shankar : ఆ సినిమా చూసి నాకు కన్నీళ్ళు వచ్చాయి : డైరక్టర్ శంకర్