Krishnaveni Death : కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి : బాలకృష్ణ

veteran actress krishnaveni

కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి : బాలకృష్ణ

 

నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణిది ఓ ప్రత్యేక అధ్యాయమని సినీ హీరో నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు.  విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నటజీవితానికి బాట వేసిన కృష్ణవేణి గారు మృతి చెందడం బాధాకరమని అన్నారు. ‘మన దేశం’ లాంటి గొప్ప చిత్రాలు నిర్మించి సమాజంలో ఉన్నత విలువలను పెంచడానికి ఆమె కృషి చేశారని, ఆమె ఎన్నో అవార్డులు అందుకున్నారని తెలిపారు.

ఇటీవల నిర్వహించిన ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలలో, అంతకుముందు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో కృష్ణవేణి గారిని ఘనంగా సత్కరించామని బాలకృష్ణ  గుర్తుచేసుకున్నారు. కృష్ణవేణి మృతి వ్యక్తిగతంగా తమకు తీరని లోటు అని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా కృష్ణవేణి కుటుంబ సభ్యులకు నందమూరి బాలకృష్ణ సానుభూతి తెలిపారు.

Rashmika : కన్నడ ప్రజలను కోపానికి గురిచేసిన రష్మిక వ్యాఖ్యలు!

Related posts

Leave a Comment