-
కౌసల్య సుప్రజా రామా’ సినిమా రివ్యూ
కన్నడ చిత్రసీమలో రూపొందిన ‘కౌసల్య సుప్రజా రామా‘ సినిమా, 2023 జులై 28న విడుదలైంది. బీసీ పాటిల్ నిర్మించిన ఈ సినిమాకు శశాంక్ దర్శకత్వం వహించాడు. ప్రధాన పాత్రల్లో డార్లింగ్ కృష్ణ, బృందా ఆచార్య, మిలన్ నాగరాజ్ నటించగా, ఈ చిత్రం కన్నడలో మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం ‘ఈటీవీ విన్’ ద్వారా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. కథ విషయానికి వస్తే…
కథ: రామ్ (డార్లింగ్ కృష్ణ) ఓ మధ్య తరగతి యువకుడు. అతని తల్లి కౌసల్య (సుధ బెళవాడి), తండ్రి సిద్ధగౌడ (రంగయన రఘు). సిద్ధగౌడ మద్యం అలవాటుతో కుటుంబాన్ని పట్టించుకోడు. తండ్రి తీరు చూసి పెరిగిన రామ్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తాడు. చిన్నప్పటి నుంచి అతనితో చదువుకున్న మేనత్త కొడుకు సంతోష్ కూడా అతనితో కలిసి ఉంటాడు.
కాలేజీలో రామ్, శివాని (బృందా ఆచార్య)ను ప్రేమించగా, అతనిలోని మొండి వైఖరి చూసి ఆమె అతణ్ని వదిలిపోతుంది. రామ్ తన మొండి స్వభావంతో ఆమెను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో తల్లి చనిపోతుంది. తల్లిని కోల్పోయిన రామ్, ఆమె మాటలను పాటించకపోవడం వల్ల తనను విడిచిపెట్టిందని గ్రహిస్తాడు. తన తల్లి చూసిన ‘ముత్తు లక్ష్మి’ అనే అమ్మాయిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ముత్తు లక్ష్మి ఎవరూ? రామ్ జీవితంలో ఆమె ప్రవేశం ఎలా మార్పులు తెస్తుంది? అనేదే కథ.
విశ్లేషణ: ‘తల్లి ఉన్నప్పుడు ఆమె విలువ తెలియదు’ అనే భావన ఆధారంగా సినిమా నడుస్తుంది. తల్లిని చిన్నచూపు చూసిన రామ్, ఆమె లేకుండా తన జీవితాన్ని అర్థం చేసుకుంటాడు. తల్లి ప్రేమను గుర్తించి మారిన రామ్ కథను దర్శకుడు ప్రతిబింబించేందుకు ప్రయత్నించాడు.
సినిమా టైటిల్ చూస్తే ఇది ప్రేమ కథ అనుకుంటారు, కానీ అసలు కథ తల్లీకొడుకుల అనుబంధాన్ని చుట్టుముడుతుందనే విషయం ప్రత్యేకత. కథ బాగానే ఉన్నప్పటికీ, మరింత చురుకైన కథనంతో చూపించాల్సిన అవసరం ఉంది.
పనితీరు: దర్శకుడు పూర్తి దృష్టిని హీరో పాత్రపై పెట్టాడు. తల్లి బ్రతికుండగా, ఆమె మరణించిన తరువాత రామ్లో వచ్చిన మార్పును హైలైట్ చేశాడు. మొదటి భాగంలో ప్రేమ, రొమాన్స్ అవకాశాలు ఉన్నా, వాటిని పూర్తిగా వినియోగించుకోలేదు. హీరో ఎప్పుడూ సీరియస్గా ఉండేలా డిజైన్ చేయడం, కథనం కొంత నెమ్మదిగా సాగడం మైనస్ పాయింట్లు. హీరోయిన్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత లేకపోవడం కూడా ఒక లోపం.
సాంకేతికంగా చూస్తే, సుగుణన్ ఫొటోగ్రఫీ, అర్జున్ జన్యా బ్యాక్గ్రౌండ్ స్కోర్, గిరి మహేశ్ ఎడిటింగ్ అంతా ఓ మాదిరిగా ఉన్నాయి. ప్రేక్షకుల్ని బలమైన భావోద్వేగాలతో ఆకట్టుకునే సన్నివేశాలు డిజైన్ చేయలేదు. తల్లి సెంటిమెంట్ను కొందరు భావోద్వేగంగా అనుభవించినా, మరికొందరికి కథ అంత బలంగా అనిపించకపోవచ్చు.
సినిమా వివరాలు:
- సినిమా పేరు: కౌసల్య సుప్రజా రామా
- OTT Plat form : ETV WIN
- విడుదల తేదీ: 2023 జులై 28
- నటులు: డార్లింగ్ కృష్ణ, బృందా ఆచార్య, మిలనా నాగరాజ్, రంగయన రఘు, అచ్యుత్ కుమార్
- దర్శకుడు: శశాంక్
- సంగీతం: అర్జున్ జన్య
- బ్యానర్: శశాంక్ సినిమాస్
- రేటింగ్: 2.5/5
సినిమా మంచి కాన్సెప్ట్తో ముందుకు సాగినప్పటికీ, మరింత బలమైన కథనం, ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఎమోషనల్ సీన్స్ ఉంటే ఇది మరింత మెరుగ్గా ఉండేది.
Read : Dhanush : ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’సినిమా రివ్యూ