-
చైనాలో 6 ఏళ్లపాటు ఉన్నాను. అక్కడివాళ్లు బొద్దింకలు, కప్పలు, పాములు, తేళ్లు ట్రై చేశాను
హీరోయిన్ కామాక్షి భాస్కర్ల .. ‘పొలిమేర’ సినిమా నుంచి ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఆమె మొదటి నుంచి బాగా చదువుకుని డాక్టర్ అయ్యారు. అయితే ఆమెకు సినిమాలపై ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం ఆమెను పూర్తిస్థాయిలో సినిమా రంగం వైపు మళ్లించింది. ప్రస్తుతం ఆమె ఇటు వెబ్ సిరీస్ లతోను .. అటు సినిమాలతోను బిజీగా ఉన్నారు. తాజాగా ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి పంచుకున్నారు.
“మొదటి నుంచి కూడా నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేదానిని. ఇల్లు – కాలేజ్ తప్ప నాకు మరేమీ తెలియదు. అలాంటి నేను ‘చైనా’లో MBBS చేయాలనుకున్నాను. చైనాలో ఇంగ్లిష్ మాట్లాడరని కూడా నాకు తెలియదు. అంత అమాయకంగా నేను అక్కడికి వెళ్లిపోయాను. అక్కడికి వెళ్లిన తరువాత వాళ్ల భాషను అర్థం చేసుకోవడానికి .. నేర్చుకోవడానికి ప్రయత్నించాను” అని అన్నారు.
“చైనాలో 6 ఏళ్లపాటు ఉన్నాను. అక్కడివాళ్లు బొద్దింకలు .. కప్పలు .. పాములు .. తేళ్లు తింటారు. ఒకానొక సమయంలో అక్కడ గ్రీనరీ లేకపోవడం వలన వీటిని ఆహారంగా తీసుకోవడానికి వాళ్లు అలవాటు పడ్డారని నాకు తెలిసింది. నేను కూడా బొద్దింకలు .. తేళ్లు ట్రై చేశాను. టేస్టు విషయానికి వస్తే .. కాస్త డిఫరెంట్ గా అనిపించింది” అని చెప్పారు. ప్రస్తుతం తన చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయని ఆమె అన్నారు.