ధనుష్ తాజా చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ ట్రైలర్ ను విడుదల
తమిళ నటుడు ధనుష్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా‘. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ చూస్తే, ఈ చిత్రం యూత్ ఎంటర్టైనర్గా వచ్చినట్లు తెలుస్తోంది.
ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. ధనుష్ చెప్పిన ‘జాలీ కమ్.. జాలీ గో “డైలాగ్ ఆకట్టుకుంది.
పావిశ్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జి. వి. ప్రకాష్ సంగీతం అందించారు. ఈ నెల 21న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదల కానుంది.
లింక్ క్లిక్ చేసి ట్రైలర్ ని చూడండి