Sanjana Krishnamurthy: డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టనున్న హీరోయిన్

sanjana krishnamurthy

యంగ్ హీరోయిన్ సంజనా కృష్ణమూర్తి అప్పుడే మెగాఫోన్ పట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ‘లబ్బర్ పందు’ సినిమాతో హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.
చెన్నైకు చెందిన సంజన… విజువల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పట్టా అందుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పనిచేసింది. ఇదే ఆమెకు సినిమాల్లో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఓవైపు హీరోయిన్ గా చేస్తూనే… మరోవైపు ప్రముఖ దర్శకుడు మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా శిష్యరికం చేసింది. దర్శకురాలిగా సంజన తొలి చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ త్వరలోనే రానున్నట్టు సమాచారం.

Read : Anil Ravipudi : చాలా విజయాలు సాధించినప్పటికీ నాకు గౌరవం లభించడం లేదు

Related posts

Leave a Comment