మలయాళ నటి నిత్యా మీనన్ సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిత్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు సినిమా పరిశ్రమ అంటే ఇష్టం లేదని చెప్పింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవితాన్ని అనుభవించాలన్నదే తన కోరిక అని… అవకాశం వస్తే మరో రంగంలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తానని చెప్పింది. అయితే జాతీయ అవార్డు తన ఆలోచనలను మార్చేసిందని చెప్పింది. ఉత్తమ నటిగా తనకు లభించిన అవార్డు తన సినీ కెరీర్లో ఒక బాటను చూపించిందని చెప్పింది.
మరోవైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్లో నిత్యా మీనన్ నటించాల్సి ఉంది. 2019లో ప్రియదర్శిని అనే యువ దర్శకుడు నిత్యా కథానాయికగా జయలలిత బయోపిక్ను చేయనున్నట్లు ప్రకటించారు. ‘ది ఐరన్ లేడీ’ టైటిల్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇది జరిగి ఐదేళ్లు కావస్తున్నా ఈ సినిమా పట్టాలు ఎక్కలేదు.
జయ బయోపిక్ గురించి నిత్య మాట్లాడుతూ.. బయోపిక్ తీయాలని చాలా ఆశలు పెట్టుకున్నామని అన్నారు. అయితే వాళ్లు సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అదే కథతో ‘తలైవి’ అనే సినిమా వచ్చింది. కొంత కాలం తర్వాత ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఈ రెండు విడుదల తర్వాత… సినిమా చేస్తే రిపీట్ అయిన ట్టు అవుతుందని… అందుకే ఆ సినిమాను పక్కన పెట్టేశామని అన్నారు.
Read : Saif Alikhan : ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిసిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్