Manchu Vishnu : సినీ పరిశ్రమలో బంధుప్రీతి ఉంది : మంచు విష్ణు

manhu vishnu

సినీ పరిశ్రమలో బంధుప్రీతి ఉందని ఎవరైనా అంగీకరించవచ్చు. చాలా మంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. మరికొందరు జాడ లేకుండా అదృశ్యమయ్యారు. ఇదే అంశంపై మాట్లాడిన టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినీ పరిశ్రమలో బంధుప్రీతి ఉందన్న విషయాన్ని తాను కూడా అంగీకరిస్తున్నానని విష్ణు తెలిపారు. అయితే బంధుప్రీతి ప్రవేశానికి మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు. టాలెంట్ ఉంటేనే జనాలు ప్రోత్సహిస్తారని… లేకుంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టమని అన్నారు. శ్రమపైనే మన కెరీర్ ఆధారపడి ఉంటుందన్నారు. తన మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ… తనలో కొంత టాలెంట్ ఉందని ప్రేక్షకులు గుర్తించారని… హీరోగా అంగీకరించారని అన్నారు. అందుకే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పాడు.

సినిమాల విషయానికి వస్తే మంచు విష్ణు తన సొంత బ్యానర్‌పై ‘కన్నప్ప’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణు, మోహన్ బాబుతో పాటు పలువురు తారలు నటిస్తున్నారు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కనిపించనున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.

Read : Janhvi Kapoor: తిరుపతిలో పెళ్లి చేసుకోవాలి… ముగ్గురు పిల్లలతో హాయిగా బతకాలి: జాన్వీ కపూర్

Related posts

Leave a Comment