మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలో డార్లింగ్ లుక్ ఎలా ఉంటుందా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వారి అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ తాజాగా ఓ అద్భుతమైన అప్‌డేట్ ఇచ్చారు. కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఇందులో ప్రభాస్ కళ్లు, నుదురు మాత్రమే కనిపిస్తున్నాయి. నుదుటిపై విభూతి నామాలతో, చేతిలో త్రిశూలంతో డార్లింగ్ శక్తివంతంగా కనిపించింది. అయితే ఆ రోజు (ఫిబ్రవరి 3)న ప్రభాస్ ఫుల్ లుక్ పోస్టర్ విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
ఇటీవల అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన కన్నప్ప పోస్టర్లు విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. శివ, పార్వతి పాత్రల్లో అక్షయ్, కాజల్ కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ‘కన్నప్ప’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read : Hero Ajith Kumar : పద్మ అవార్డుపై నటుడు అజిత్ భావోద్వేగం