Janhvi Kapoor: తిరుపతిలో పెళ్లి చేసుకోవాలి… ముగ్గురు పిల్లలతో హాయిగా బతకాలి: జాన్వీ కపూర్

jahnavi kapoor

శ్రీదేవి వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తన ప్రతిభతో అగ్ర నటిగా ఎదిగింది. ఆమె పాన్ ఇండియా చిత్రాలతో చాలా బిజీగా ఉంది. బాలీవుడ్, టాలీవుడ్ తేడా లేకుండా సినిమాలు చేస్తోంది. తారక్‌తో ‘దేవరా 2’, రామ్‌చరణ్‌తో ‘ఆర్‌సి 16’ చేస్తోంది.  తాజాగా బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ షోలో పాల్గొన్న జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనేది తన కోరిక అని చెప్పింది. తన భర్త, ముగ్గురు పిల్లలతో తిరుమలలో హాయిగా గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

రోజూ అరటి ఆకులో అన్నం తిని… గోవిందా గోవిందా స్మరించుకోవాలని ఆమె అన్నారు. అలాగే మణిరత్నం సినిమాల సంగీతం కూడా కూర్చుని వినాలని ఉందని చెప్పింది. జాన్వీకి తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి అనే విషయం తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా తిరుమల దర్శనానికి వస్తుంటుంది.

Read : Amazon Prime : ‘పాతాళ్ లోక్ 2’ వెబ్ సిరీస్ రివ్యూ!

Related posts

Leave a Comment