‘వీరసింహారెడ్డి’ సినిమాలో బాలకృష్ణ సరసన నటించిన మలయాళ నటి హనీరోస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఆమె ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ సంచలనం రేపుతోంది. కేరళకు చెందిన ఓ వ్యాపారి తాను ఎక్కడికి వెళ్లినా తన వద్దకు వచ్చి లైంగికంగా వేధించేవాడని ఆమె తెలిపింది. గతంలో ఓ వ్యక్తి తనను ఓ కార్యక్రమానికి ఆహ్వానించాడని, అయితే ఇతర కారణాల వల్ల తాను హాజరు కాలేదని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అతడిపై పగ తీర్చుకునేందుకు తన వెంటే ఉన్నాడని తెలిపింది.
తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని… న్యాయపరంగా పోరాడతానని చెప్పింది. అతని వేధింపులను ఎందుకు భరించాలని ప్రశ్నించింది. మరోవైపు సోషల్ మీడియాలో హనీరోస్ పై అసభ్యకరమైన సందేశం పెట్టిన వ్యక్తిని తిరువనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు.
Read : Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ ట్రైలర్ ఫుల్ మాస్.. బాలకృష్ణ యాక్షన్ అదుర్స్!