Daku Maharaj Movie: ఈరోజు హైదరాబాద్ లో ‘డాకు మహరాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

daku maharaj poster

Daku Maharaj Movie

బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రూపొందిన ‘డాకు మహారాజ్‌’ చిత్రం ఈ నెల 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అనంతపురంలో జరగాల్సి ఉంది. అయితే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందిన నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో బాలయ్య అభిమానులు కాస్త డైలమాలో పడ్డారు. దీంతో వారి కోసం మరో ఈవెంట్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

Read : Aha OTT : ఆహా ఓటీటీ లో మరో క్రైమ్ థ్రిల్లర్!

 

Related posts

Leave a Comment