Aha OTT : ఆహా ఓటీటీ లో మరో క్రైమ్ థ్రిల్లర్!

aha ott dagudu moothalu

Aha OTT : ఆహా ఓటీటీ లో మరో క్రైమ్ థ్రిల్లర్!

థ్రిల్లర్ జానర్‌కి సంబంధించిన కంటెంట్ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువగా కనిపిస్తుంది. థ్రిల్లర్ జోనర్‌లో వచ్చే సినిమాలను, వెబ్ సిరీస్‌లను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడమే ఇందుకు కారణం. అందుకే అన్ని OTTలు వీలైనంత వరకు ఈ జానర్‌లో కంటెంట్‌ని అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ‘ఆహా’లో ఓ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కి చెందిన ఓ సినిమాని ఈ వారంలోనే విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ సినిమా పేరు ‘దాగుడు మూతలు’. బసిరెడ్డి రానా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో విశ్వంత్ .. రియా సచ్ దేవ్ .. శిల్పా మంజునాథ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. అయితే సరైన పబ్లిసిటీ లేకపోవడంతో థియేటర్లకు ఎప్పుడు వచ్చిందో ప్రేక్షకులకు తెలియడం లేదు. లిజో కె. జోన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం OTT వైపు ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

Read : Joju George: బడ్జెట్ తక్కువ .. వసూళ్లు 60 కోట్లు

Related posts

Leave a Comment