Jani Master : అప్ప‌టి వ‌ర‌కు నేను నిందితుడిని మాత్ర‌మే… క్లీన్‌చిట్‌తో బ‌య‌ట‌కు వ‌స్తా : జానీ మాస్ట‌ర్

Jani Master
  • క్లీన్‌చిట్‌తో బ‌య‌ట‌కు వ‌స్తా : జానీ మాస్ట‌ర్

ఫిమేల్ కొరియోగ్రాఫ‌ర్‌పై జానీ మాస్ట‌ర్ లైంగిక దాడి నిజమేన‌ని తాజాగా హైద‌రాబాద్ నార్సింగి పోలీసులు ఛార్జిషీట్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే దీని మీద ఆయ‌న స్పందించారు. న్యాయ‌స్థానం మీద త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని, తాను నిర్దోషిగా బ‌య‌టకు వ‌స్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు జానీ మాస్ట‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక వీడియోని  విడుద‌ల చేశారు.  “ఈ కేసులో ఏం జ‌రిగింద‌నేది నా మ‌న‌సుకు, దేవుడికి తెలుసు. ఏదైనా న్యాయ‌స్థానం నిర్ణ‌యిస్తుంది. నేను క్లీన్‌చిట్‌తో బ‌య‌ట‌కు వ‌స్తా. అప్పుడే మాట్లాడుతా. అప్ప‌టి వ‌ర‌కు నేను నిందితుడిని మాత్ర‌మే. అభిమానుల ప్రేమ నాపై ఎప్పుడూ ఉండాలి” అని వీడియోలో జానీ మాస్ట‌ర్ పేర్కొన్నారు. 

కాగా, తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఫిమేల్ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో అక్టోబర్ 25న చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. అటు లైంగిక వేధింపుల కేసు కారణంగా జానీ మాస్టర్ నేషనల్ అవార్డును సైతం కోల్పోయిన విష‌యం తెలిసిందే.  ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాలకి కొరియోగ్రాఫి చేస్తూ బిజీ గా ఉన్నారు. 

Read : జానీ మాస్టర్ రియాక్షన్.. | Jani Master About Allu Arjun | ‪@ManamTvOfficial‬

Related posts

Leave a Comment