Cine Writers and Directors Training Camp : సినీ, టివి, రచయిత, దర్శకుల శిక్షణ శిబిరం

cinema

జనవరి 4 నుండి సినీ, టివి, రచయిత, దర్శకుల శిక్షణ శిబిరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాష సాంస్క్రతిక శాఖ (Telangana State Government language &. Cultural Akadamy) సౌజన్యంతో భారత్ కల్చరాల్ అకాడమీ,

– సినీ, టివి, రచయిత, దర్శకుల శిక్షణ శిబిరం

జనవరి 4 నుండి సినీ, టివి, రచయిత, దర్శకుల శిక్షణ శిబిరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాష సాంస్క్రతిక శాఖ (Telangana State Government language &. Cultural Akadamy) సౌజన్యంతో భారత్ కల్చరాల్ అకాడమీ, ఓం సాయి తేజా ఆర్ట్స్, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం సంయుక్తంగా జనవరి 4,5 తేదీలలో రవీంద్ర భారతి లో ఔత్సయిక దర్శకులను, రచయితలను ప్రోత్సహించడానికి “సినీ టివి దర్శకుల, రచయితల శిక్షణ శిభిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు నాగబాల సురేష్ కుమార్ తెలిపారు. మూల కథ, కధా విస్తరణ, సంభాషణలు, సన్నివేశ ప్రాధాన్యత, దర్శక లక్షణాలు మొదలైన అంశాలపై ప్రముఖ దర్శక రచయితలు శిక్షణను ఇస్తారు.

వారిలో యస్ వి కృష్ణా రెడ్డి,తమ్మారెడ్డి భరద్వాజ,వి ఎన్ ఆదిత్య, రాజ్ కందుకూరి, చంద్ర మహేష్, ముళ్ళపూడి వర, కెమరామెన్ మీర్, ప్రేమ్ రాజ్,మామిడి హరి కృష్ణ, బాబ్జి, మానస్ దండనాయక, సూచనలు ఇస్తారు. తాము నిర్వహిస్తున్న 11వ శిక్షణ శిభిరంలో చలనచిత్ర, టెలివిజన్ రంగాలలో ప్రవేశ్నించాలనుకునే వారు ఎవరైనా శిక్షణ తీసుకోవవచ్చునని సురేష్ కుమార్ తెలిపారు. ఇతర వివరాలకు రచయితల సంఘం ప్రేమ్ రాజ్, అధ్యక్షుడు 8919112552, కార్యదర్శి కర్రా నరేందర్ రెడ్డి 8897845129, చిత్తరంజన్ 9032662113, మానస్ దండనాయక, ఓం సాయి తేజా ఆర్ట్స్ 9578246726 లను సంప్రదించవచ్చు. అభ్యర్థులకు రెండు రోజులు భోజన సౌకర్యం తో పాటు సర్టిఫికెట్ ప్రదానం ఉంటుందని నాగబాల సురేష్ కుమార్ తెలియచేసారు.

Read : Kalyan Ram : #NKR21 నుంచి  ఫస్ట్ లుక్ రిలీజ్

 

Related posts

Leave a Comment