Reviews

“హను మాన్” నెగిటివిటీపై డైరెక్టర్ ఫన్ పోస్ట్.!

లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన “హను మాన్” చిత్రం పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. మరి భారీ వసూళ్లు కొల్లగొట్టిన ఈ చిత్రం అందుకున్న విజయాన్ని కానీ రెస్పాన్స్ ని కానీ చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు. మరి ఆ రేంజ్ లో పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ ని ఈ సినిమా షేక్ చేయగా అంత పాజిటివ్ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక్క చోట అయినా నెగిటివ్ కామెంట్స్ ఉండకుండా ఉంటాయా?

అలానే వచ్చిన కొన్ని నెగిటివ్ కామెంట్స్ కి నెగిటివ్ రెస్పాన్స్ పై దర్శకుడు ప్రశాంత్ వర్మ పెట్టిన మంచి ఫన్ పోస్ట్ వైరల్ గా మారింది. తాను తన నిర్మాత నిరంజన్ రెడ్డి కలిసి ఫోన్ లో చూస్తూ “హను మాన్” పై నెగిటివిటీని హనుమాన్ స్పిరిట్ తో నవ్వుతూ బ్రౌజ్ చేస్తున్నామని బ్యూటిఫుల్ మూమెంట్ ని షేర్ చేసుకున్నాడు. మరి వీరు ఈ రకంగా నెగిటివిటీని కూడా మంచి పాజిటివ్ స్పూర్తితో తీసుకోవడం హర్షించదగిన అంశం అని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *