Movie Updates

‘స్పిరిట్’ లో హీరోయిన్ గా ఆమె ఫిక్స్ ?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి మారుతీ తీస్తున్న ది రాజా సాబ్ కాగా మరొకటి నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడి. ఇక వీటి అనంతరం అతి త్వరలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నారు ప్రభాస్. ఇందులో ఆయన ఒక హానెస్ట్ అండ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు ఇటీవల పలు ఇంటర్వ్యూస్ లో భాగంగా దర్శకుడు సందీప్ మాట్లాడుతూ చెప్పారు.

విషయం ఏమిటంటే, గ్రాండ్ లెవెల్లో భారీ హంగులతో రూపొందనున్న ఈ మూవీలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్. ఇటీవల రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఆనిమల్ లో రష్మిక హీరోయిన్ గా నటించి తన అందం, అభినయంతో అందరినీ మెప్పించిన విషయం తెలిసిందే. రష్మిక వర్క్ తనకు ఎంతో నచ్చడంతో మరొక్కసారి స్పిరిట్ లో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని సందీప్ ఫిక్స్ అయ్యారట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై ఆ మూవీ మేకర్స్ నుండి అఫీషయల్ గా క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *