సినిమా పరిశ్రమకు అన్నివిధాలుగా అండగా ఉంటా : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు నేడు ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్.డీ.సి కార్యాలయంలో నేడు ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పదవీ భాద్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యక్రమానికి హాజరై దిల్ రాజ్ ను అభినందించారు.
-సినిమా పరిశ్రమకు అన్నివిధాలుగా అండగా ఉంటా
– దిల్ రాజ్ పదవి ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్
రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు నేడు ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్.డీ.సి కార్యాలయంలో నేడు ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పదవీ భాద్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యక్రమానికి హాజరై దిల్ రాజ్ ను అభినందించారు. తెలంగాణా లో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇండస్ట్రీ కి చెందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వడంలో దిల్ రాజు సేవలు ఎంతగానో ఉపయోగపడతాయాని ఈ సందర్బంగామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన షూటింగ్స్ తెలంగాణా లో మరింత ఎక్కువగా జరిగే విధంగా ప్రయత్నిస్తానని కృషి చేస్తానని దిల్ రాజ్ పేర్కొన్నారు.
Read : Dil Raju : రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవీ భాద్యతలు స్వీకరించిన దిల్ రాజ్