Movie Updates

సస్పెన్స్ థ్రిల్లర్ “ఫియర్” ట్రైలర్ రిలీజ్

హీరో మాధవన్ చేతుల మీదుగా వేదిక సస్పెన్స్ థ్రిల్లర్ “ఫియర్” ట్రైలర్ రిలీజ్, ఈనెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

fear moviet trailer
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.‌ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ రోజు “ఫియర్” మూవీ ట్రైలర్ ను హీరో మాధవన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. “ఫియర్” ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉందన్న మాధవన్..ట్రైలర్ థ్రిల్ చేసిందని చెప్పారు. “ఫియర్” టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు.

“ఫియర్” ట్రైలర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంది. సింధు పాత్రలో వేదిక అద్భుతమైన పర్ ఫార్మెన్స్ చేసింది. సింధును బాల్యం నుంచి వెంటాడుతున్న బూచోడు ఎవరు, ఆమెను ఎందుకు భయపెడుతున్నాడు అనేది ట్రైలర్ లో ఆసక్తి కలిగించింది. ట్రైలర్ చివరలో నాయికను ద్విపాత్రాభినయంలో చూపించడం థ్రిల్ చేసింది. అనూప్ రూబెన్స్ అందించిన బీజీఎం, ఐ ఆండ్రూ విజువల్స్ టాప్ క్వాలిటీతో ఉన్నాయి. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూడబోతున్న ఫీలింగ్ “ఫియర్” ట్రైలర్ క్రియేట్ చేస్తోంది.
నటీనటులు – వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు.

Read :సన్నీ డియోల్ అవైటెడ్ యాక్షనర్ ‘జాట్’ టీజర్ రిలీజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *