Reviews

సమీక్ష : “లాల్ సలామ్” – ఆకట్టుకొని బోరింగ్ డ్రామా

విడుదల తేదీ : ఫిబ్రవరి 09, 2024

రేటింగ్ : 2.25/5

నటీనటులు: రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య, అనంతిక సనీల్‌కుమార్, వివేక్ ప్రసన్న, తంగదురై

దర్శకత్వం : ఐశ్వర్య రజనీకాంత్

నిర్మాత: సుభాస్కరన్

సంగీత దర్శకుడు: A.R. రెహమాన్

సినిమాటోగ్రఫీ: విష్ణు రంగసామి

ఎడిటింగ్: బి. ప్రవీణ్ బాస్కర్

సంబంధిత లింక్స్: ట్రైలర్


కోలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం లో తెరకెక్కిన కొత్త చిత్రం లాల్ సలామ్ నేడు థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఆమె తండ్రి, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో, విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

కథ:

కసుమూరు అనే గ్రామంలో గురు (విష్ణు విశాల్) మరియు సంషుద్దీన్ (విక్రాంత్) ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్. ఒక విషాద సంఘటన వారిని దూరం చేసి, వారిని బద్ద ప్రత్యర్థులుగా మార్చింది. ముంబయికి చెందిన టెక్స్‌టైల్ వ్యాపారి మొయిదీన్ భాయ్ (రజినీకాంత్)కి గురు తో మరియు గ్రామంతో సంబంధాలు ఉన్నాయి. కసుమూరు గ్రామస్థులకు మరో గ్రామం నుండి అవమానాలు ఎదురయ్యే వరకు సినిమా సాఫీగా సాగుతుంది. ఆ తర్వాత సంఘటనలు ఒక్కసారిగా మారిపోతాయి. పరిస్థితి తీవ్రతరం కావడం, మొయిదీన్ భాయ్ ప్రమేయం, యువకులు ఆ సమస్యను తీర్చగలరా? లేదా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి

ప్లస్ పాయింట్స్:

విష్ణు విశాల్ పాత్ర ఆకట్టుకుంటుంది. తను చక్కని నటనను ప్రదర్శించాడు. పల్లెటూరి వాతావరణం మరియు మరికొన్ని సన్నివేశాలు చాలా అందంగా చూపించబడ్డాయి.

విక్రాంత్ నటనకు బాగానే ఉంది. విక్రాంత్ తండ్రి పాత్రలో రజనీకాంత్ తన మేనరిజమ్స్, మంచి డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

జీవితా రాజశేఖర్ తన నటనతో ఆకట్టుకుంది. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

కథాంశం మరియు దాని స్లో స్క్రీన్‌ప్లే సినిమాకి అతి పెద్ద సమస్యలు. ఐశ్వర్య రజనీకాంత్ ప్రేక్షకులకు అందించడానికి ఉద్దేశించిన సందేశం అంతగా ఆకట్టుకోదు. అంతేకాక తను చెప్పదలచుకున్న కథ చాలా పాత సినిమాలలో కనిపిస్తుంది. డైరెక్టర్ గా మరియు స్క్రీన్ రైటర్‌గా, ఆమె స్క్రిప్ట్ రైటర్ విష్ణు రంగసామిని మరింత ఎమోషన్స్ తో నింపమని చెప్పి, మరింత ఎఫెక్టివ్ గా చెప్పవచ్చు. కానీ అలా జరగలేదు.

సినిమాలో ఎమోషన్ సీన్స్ అంతగా ప్రభావం చూపవు. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోవడం తో వాటి ప్రభావాన్ని మరింత తగ్గించాయి.

డబ్బింగ్ సెలెక్షన్ కారణంగా, ఇతర నటీనటులు తెలుగు ఆడియెన్స్ కి తెలియక పోవడం మరొక కారణం గా సినిమాకి సగటు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు.

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంతో కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. హీరోయిన్ అనంతిక, కపిల్ దేవ్ మరియు నిరోషాలను చేర్చుకోవడంతో కథనానికి కాస్త తక్కువ విలువను జోడించినట్లు ఉంటుంది.

సాంకేతిక విభాగం:

స్క్రీన్‌ప్లే రైటర్ గా, దర్శకురాలిగా ఐశ్వర్య రజనీకాంత్ డ్యూయల్ రోల్ తో ఒక మంచి అనుభూతిని అందించడంలో విఫలం అయ్యింది. చిన్న స్టోరీ లైన్ తో స్లో పేస్ తో సాగే సినిమా, ముఖ్యంగా సెకండాఫ్ లో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.

ప్రవీణ్ బాస్కర్ యొక్క ఎడిటింగ్ మరియు విష్ణు రంగసామి యొక్క సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, AR రెహమాన్ యొక్క స్కోర్ అతని అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. అంతేకాక సినిమా యొక్క రన్‌టైమ్ కూడా సినిమా రిజల్ట్ పై ఎఫెక్ట్ చూపించింది.

తీర్పు:

మొత్తమ్మీద లాల్ సలామ్ మూవీ మంచి నటీనటుల ప్రదర్శన బాగున్నప్పటికీ, రొటీన్ స్క్రీన్ ప్లే, డల్ గా సాగే కథనం తో అంతగా ఆకట్టుకోదు. సినిమాకి కరెక్ట్ రైటింగ్ లేకపోవడం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలని అంతగా ఎలివేట్ చేయకపోవడం తో బోరింగ్ గా అనిపిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రెజెన్స్ సినిమాకి ఎలాంటి సహాయం చేయలకే పోయింది అని చెప్పాలి. ఈ వారాంతం ఈ సినిమాను స్కిప్ చేయడం బెటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *