రామ్ చిత్రాలకి బుల్లితెర పై సాలిడ్ రెస్పాన్స్!
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస చిత్రాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. రామ్ చివరి రెండు చిత్రాలు అయిన ది వారియర్ మరియు స్కంద చిత్రాలు థియేటర్ల లో ఫ్లాప్ గా నిలిచాయి. ఈ చిత్రాలు రామ్ పోటెన్షియల్ కి తగినట్లు గా ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టాయి అంటే రామ్ పెర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పాలి. ఈ రెండు చిత్రాలకు బుల్లితెర పై మాత్రం సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
ది వారియర్ మూవీ 10.02 టీఆర్పీ రేటింగ్ ను రిజిస్టర్ చేయగా, ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చిన స్కంద 8.47 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అనే చెప్పాలి. హీరో రామ్ తదుపరి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.