Reviews

మమ్ముట్టి ‘భ్రమయుగం’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ థ్రిల్లర్ మూవీ భ్రమయుగం. రాహుల్‌ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకుని అందరిలో మంచి క్యూరియాసిటీ ఏర్పరిచాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 15న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ అప్‌డేట్ అందించారు మేకర్స్.

భ్రమయుగం ట్రైలర్‌ గ్లోబల్‌ లాంఛ్ ఈవెంట్‌ ఫిబ్రవరి 10న అబుదాబిలో జరుగనుండగా ట్రైలర్ ని పాన్ ఇండియన్ భాషల్లో రేపు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 15న థియేటర్లలో సందడి చేయనుంది.

భ్రమయుగంలో అమల్ద లిజ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోండగా సిద్దార్థ్‌ భరతన్‌, అర్జున్ అశోకన్‌, జిసు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి, వై నాట్ స్టూడియో బ్యానర్లు గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో, హై టెక్నీకల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నాయి. కాగా ఈ మూవీ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *