ఫైనల్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ది కేరళ స్టోరీ’
ఇటీవల ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కాంట్రవర్షియల్ మూవీ ది కేరళ స్టోరీ పలువురి నుండి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద ఇండియా వైడ్ గా రూ. 240 కోట్ల నెట్ కలెక్షన్ ని అందుకుంది. కేరళ అమ్మాయిలను ముస్లిమ్స్ గా మార్చడం అనే అంశం పై రూపొందిన ఈ మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా విపుల్ అమృత్ లాల్ షా గ్రాండ్ గా నిర్మించారు.
విషయం ఏమిటంటే, మొత్తంగా తొమ్మిది నెలల థియేటర్ రిలీజ్ అనంతరం నేడు ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ద్వారా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి కేరళ స్టోరీకి ఓటిటి ఆడియన్స్ నుండి ఎంతమేర స్పందన లభిస్తుందో చూడాలి. వీరేష్ శ్రీవైసా మరియు బిషాక్ జ్యోతి సంగీతం అందించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో యోగితా బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నాని, దేవదార్శిని, విజయ్ కృష్ణ నటించారు.