నేను చూస్తున్నది నిజమేనా… నమ్మలేకపోతున్నా : రష్మిక మందన్న
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో ప్రదర్శన చేసిన సంధ్య థియేటర్ ఘటన కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, నాంపల్లి కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించడం, దాని మీద తెలంగాణ హైకోర్టులో రెండు గంటల పాటు సుదీర్ఘ విచారణ జరగడం, ఆపై అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడం… తెలిసిందే. కాగా, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై పుష్ప-2 హీరోయిన్ రష్మిక మందన్న స్పందించారు. ఇప్పుడు నేను చూస్తున్నది నిజమేనా… నమ్మలేకపోతున్నా అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన దురదృష్టకరమైనదని, అత్యంత విషాదభరితమైనదని పేర్కొన్నారు. కానీ దీనంతటికీ ఒక్కరినే బాధ్యులుగా చేయడం కలచివేస్తోందని రష్మిక ట్వీట్ చేశారు.