దిక్కు లేని వాడికి…దేవుడే… మారిన సినిమాల ట్రెండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 19, (న్యూస్ పల్స్)
దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనే మాటను చాలా సార్లు వినే ఉంటాం. కానీ
ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇదే మాట ఇంకాస్త కొత్తగా వినిపిస్తోంది.
సిల్వర్ స్క్రీన్ మీద చిన్న హీరోలకు దేవుడే అండ అంటున్నారు. గాడ్ ఈజ్
గ్రేట్ అనుకుంటూ చాలా మంది ఇప్పుడు ఈ ఫార్ములాకే
ఫిక్సయిపోతున్నారు.సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా విడుదలై, వసూళ్ల
సునామీని సృష్టించింది హనుమాన్ సినిమా. ఆవకాయ ఆంజనేయ పాటను ఇప్పటికీ
మళ్లీ మళ్లీ పాడుకుంటున్నారు పిల్లలు.తేజ సజ్జా హీరోగా నటించిన
హనుమాన్‌కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఎంత హెల్ప్ అయ్యాయో,
ఆంజనేయుడి ప్రస్తావన కూడా అంతకన్నా ఎక్కువగా ప్లస్ అయింది. నిఖిల్
కార్తికేయ2 సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్లో ప్రొజెక్ట్ చేసిన
కాన్సెప్ట్ కృష్ణతత్వం. ద్వారక బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన కార్తికేయ
చూసిన నార్త్ ఆడియన్స్ కి గూస్బంప్స్ వచ్చాయి. కృష్ణతత్వాన్ని పదే పదే
గుర్తుచేసుకున్నారు ఆడియన్స్.సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా
ఊరి పేరు భైరవకోన. ఈ సినిమాలో శివుడి పాటను విడుదల అయింది. ఆల్రెడీ
టాలీవుడ్లో చిన్న సినిమాలకు సాయం అందించి అండగా ఉంటున్న దేవుడు
కాన్సెప్ట్ తమ చిత్రానికి కూడా కలిసొస్తుందన్నది మేకర్స్
మేట.విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న సినిమా గామి. టైటిల్ అనౌన్స్ మెంట్
వీడియో గమనించిన వారందరికీ అఘోరాల సమావేశం, వారణాసి వాతావరణం, గంగా తీరం
కనిపించాయి. వీటన్నటినీ బట్టి గామిలోనూ ఆధ్యాత్మిక అంశాలు పుష్కలంగా
ఉంటాయనే విషయం స్పష్టమవుతోంది.