“చరణ్ 16″లో సామ్ కాదు ఈ బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్..
ప్రస్తుతం గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తో సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత తన కెరీర్ 16వ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేయనున్నాడు. మరి దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొనగా మేకర్స్ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం కోసం ఇపుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆడిషన్స్ చేస్తున్నారు. మరి ఈ క్రమంలోనే రీసెంట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా అయితే చరణ్ హిట్ పెయిర్ సమంత నటిస్తుంది అని రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు హీరోయిన్ విషయంలో మరింత క్లారిటీ వస్తుంది.
దీని ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అయితే లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో సామ్ ప్లేస్ లో అయితే ఇప్పుడు జాన్వీ ఫిక్స్ అయ్యిందని చెప్పాలి. మరి ఈ భారీ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో నిర్మాణం వహిస్తున్నారు.