Movie Updates

కలియుగం 2064 ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం

నిర్మాత కె.ఎస్. ఆర్‌కె ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రామకృష్ణ, సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కలియుగం 2064 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రద్ధా శ్రీనాథ్ మరియు కిషోర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం నిర్మాణ దశలన్నీ పూర్తి చేసుకుంది.

 

Kaliyugam 2064 First Look Released by Legendary Director Mani Ratnam
కలియుగం 2064 ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం
ఆర్.కె.ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.ఎస్. రామకృష్ణ నిర్మాత గా శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో అడ్వెంచర్ సైన్సు ఫిక్సన్ థ్రిల్లర్ గా రూపొందిన “కలియుగమ్ 2064″ అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. అసలే కలియుగమ్ ఆపై 2064… ఆ ఫ్యూచర్లో మనుష్యులు ఎలా ఉండబోతున్నారు ఎలా బ్రతుకబోతున్నారు ఎలా చావబోతున్నారు… అనే అంశాలతో… ఈ సినిమా కథ, కథాంశం ఉంటుంది.
తెలుగు, తమిళ్ బైలింగవ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను లెజండరీ డైరెక్టర్ మణిరత్నం విడుదల చేశారు. “వినూత్న కథాంశంతో రాబోతున్న ”కలియుగమ్ 2064″ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు మణిరత్నం తెలిపారు.
 మొదటిసారి మణిరత్నం గారు ఇలా తెలుగు సినిమా పోస్టర్ విడుదల చెయ్యడం విశేషం. సినిమా కాన్సెప్ట్, పోస్టర్ బాగుందని చిత్ర యూనిట్ సభ్యులతో చాలా సేపు ముచ్చటించడం గొప్ప విషయం. 
తెలుగులో హీరో నాని తో జెర్సీ మూవీ లో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన ప్రాత్రాల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీ లో మరో కీలకమైన పాత్రలో చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు.
ఈ మూవీ ఇప్పటి జెనరేషన్ కి చాలా అవసరమని , ఇది యువత ఫ్యామిలీ పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ అని , ఈ మూవీని అందరూ చూసి , మా ఈ క్రొత్త ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుతున్నామని, ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్ నార్వేలో చేబడ్డాయి, త్వరలో ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని నిర్మాత కె.ఎస్.రామకృష్ణ తెలిపారు.
నటీనటులు:
శ్రద్ధా శ్రీనాధ్, కిషోర్, ఇనియన్ సుబ్రమణి, హ్యారీ తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్ :ఆర్. కె. ఇంటర్నేషనల్ 
నిర్మాత :కె. యస్. రామకృష్ణ
రచన & దర్శకత్వం :ప్రమోద్ సుందర్ 
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ :కె. రామ్ చరణ్
ఎడిటర్ :నిమల్ 
సంగీత దర్శకుడు :డాన్ విన్సెంట్ 
ఆర్ట్ డైరెక్టర్ :శక్తి వెంకట్రాజు 
సౌండ్ డిజైన్: తపస్ నాయక్

links  : https://x.com/TodayBoxOffice/status/1857747550046203946?t=qHg3_dvPsMuEgae2lcGGnw&s=19

 

 

Read : తనయుడు మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ ని అనౌన్స్ చేసిన నందమూరి బాలకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *