TV & OTT News

ఓటీటీ : ఈ 4 భాషల్లో ధనుష్ “కెప్టెన్ మిల్లర్” వచ్చేసింది

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ మాతేశ్వరణ్ తెరకెక్కించిన భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా “కెప్టెన్ మిల్లర్”. మరి ఈ సంక్రాంతి కానుకగా తమిళనాట రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కి వచ్చింది. కానీ అనుకున్న రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ ని అందుకోలేదు. మరి ఇప్పుడు అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ ఓటీటీ వెర్షన్ అయితే ఇప్పుడు వచ్చేసింది.

ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ సంస్థ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం ఈరోజు నుంచి తమిళ్, తెలుగు సహా మళయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇప్పుడు చూడాలి అనుకునేవారు ఈ చిత్రాన్ని ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించగా శివ రాజ్ కుమార్ అలాగే సందీప్ కిషన్ తదితరులు నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *