ఓటిటి లో ‘భామా కలాపం – 2’ కు మంచి రెస్పాన్స్
ప్రియమణి ప్రధాన పాత్రలో అభిమన్యు దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన భామ కలాపం మూవీ ఓటిటి లో రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది. ఇక తాజాగా దానికి సీక్వెల్ గా తెరకెక్కిన భామ కలాపం 2 ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే విషయం ఏమిటంటే, రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే ఈ మూవీకి ఏకంగా 50 మిలియన్ మినిట్స్ కి పైగా వ్యూస్ లభించాయి.
ఈ విషయాన్ని ఆహా వారు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. ప్రియమణి ఆకట్టుకునే అందం, అభినయం ప్రదర్శించిన ఈ డార్క్ క్రైమ్ కామెడీ మూవీలో శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, బ్రహ్మాజీ, రఘు ముఖర్జీ, అనుజ్ గుర్వారా కీలక పాత్రలు చేయగా ఆహా వారితో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర, డ్రీమ్ ఫార్మర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించారు. దీనికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.