ఓటిటి : ఇక నుంచి ఇంటర్నేషనల్ భాషలో “అనిమల్”
బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ ఇంటెన్స్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా “అనిమల్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం వాటిని అందుకొని అదరగొట్టింది. ఇక రీసెంట్ గానే దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం అందుబాటులోకి రాగా ఈ చిత్రం అందులో కూడా రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ ని అందుకుంది.
ఇక దీనితో పాటుగా ఈ చిత్రం ఓటిటి వెర్షన్ పై అయితే లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ వారు మరో సాలిడ్ అప్డేట్ ని అందించారు. దీనితో ఈ చిత్రం ఇప్పుడు నుంచి పాన్ ఇండియా భాషలతో పాటుగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో కూడా స్ట్రీమింగ్ అవుతున్నట్టుగా ఇప్పుడు తెలిపారు. దీనితో ఈ చిత్రం ఇక నుంచి ఫారిన్ ఆడియెన్స్ ని కూడా అలరించనుంది అని చెప్పాలి. మరి వారి నుంచి అయితే ఎలాంటి రెస్పాన్స్ ఈ చిత్రం అందుకుంటుందో చూడాలి.