“ఈగల్” కి కూడా సీక్వెల్..పవర్ఫుల్ టైటిల్ లాక్
మాస్ మహారాజ రవితేజ హీరోగా కావ్య థపర్ హీరోయిన్ గా దర్శకుడు యంగ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన భారీ యాక్షన్ ట్రీట్ చిత్రం “ఈగల్”. మరి మంచి బజ్ నడుమ ఈరోజు ఈ చిత్రం రిలీజ్ కాగా ఫ్యాన్స్ నుంచి అయితే మంచి ఫీడ్ బ్యాక్ ని అందుకుంటుంది. ఇక ఈ చిత్రంపై అయితే రిలీజ్ తర్వాత సాలిడ్ న్యూస్ బయటకి వచ్చింది. ఇటీవల టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన సీక్వెల్స్ జాబితాలో ఇప్పుడు ఈగల్ కూడా చేరింది.
ఈ చిత్రానికి కూడా మేకర్స్ పార్ట్ 2ని ఫిక్స్ చేయగా పార్ట్ 2 కి పవర్ ఫుల్ టైటిల్ ని కూడా లాక్ చేశారు. దీనితో ఈగల్ రెండో భాగం అయితే “ఈగల్ – యుద్ధకాండ” గా రానున్నట్టుగా ఇప్పుడు ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ అవసరాల, వినయ్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా డేవ్ జాన్ద్ సంగీతం అందించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు